Harish Rao letter to CM Revanth Reddy | రాష్ట్రంలో పంట కొనుగోళ్ల వ్యవహారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ధాన్యం సేకరణలో జాప్యం, మిల్లుల వద్ద తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని నిరసిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు.
హరీష్ రావు లేఖలోని ముఖ్యాంశాలు..
జొన్నలు, శనగలు, పొద్దుతిరుగుడు పంటలను ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
మొక్కజొన్న కొనుగోళ్లపై విధిస్తున్న కఠిన నిబంధనలను తక్షణమే సడలించి, రైతుల నుంచి పూర్తిస్థాయిలో సేకరణ చేపట్టాలి.
కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడం రైతులపై కక్షపూరిత ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.
రైస్ మిల్లుల దగ్గర బస్తాకు కిలో, రెండు కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ను ధాన్యం డబ్బులతో పాటే కలిపి ఇవ్వాలని హరీష్ రావు స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరవాలని, రైతులకు భరోసా కల్పించాలని ఆయన లేఖలో కోరారు.







