Wednesday 15th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > న్యూ ఇయర్ తొలి రోజు గుజరాత్ గిన్నిస్ రికార్డ్!

న్యూ ఇయర్ తొలి రోజు గుజరాత్ గిన్నిస్ రికార్డ్!

Gujarat Guinness record

Gujarat Guinness Record | నూతన సంవత్సరం తొలి రోజున గిన్నీస్ రికార్డ్ (Guinness Record) సృష్టించింది గుజరాత్ రాష్ట్రం. సోమవారం ఉదయం రాష్ట్రంలోని 108 వివిధ ప్రాంతాల్లో దాదాపు 4 వేల మంది ఏకకాలంలో సూర్యనమస్కారాలు చేశారు.

యువత, విద్యార్థులు, పలు కుటుంబాలు మరియు యోగ ఔత్సాహికులు 51 విభిన్న కేటగిరీల్లో సూర్యనామస్కారాలు ప్రదర్శించారు. ప్రసిద్ధ మొదేరా సూర్య దేవాలయంలో సూర్యనామస్కార (Surya Namaskar) కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర సీఎం భుపేంద్ర పటేల్.

“అత్యధిక మంది ఒకేసారి సూర్యనామస్కారాలు చేయడంలో ఇదే తొలి రికార్డ్ అని గుజరాత్(Gujarat) రాష్ట్రం ఈ ఘనతను సొంతం చేసుకుంది” అని వెల్లడించారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి.

ఈ నేపథ్యంలో గుజరాత్ సాధించిన ఈ రికార్డ్ పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరాన్ని గుజరాత్ అరుదైన ఘనతతో స్వాగతించిందని తెలిపారు పీఎం. అలాగే ప్రతిఒక్కరు సూర్య నమస్కారాన్ని రోజువారీ పనుల్లో భాగం చేసుకోవాలని కోరారు ప్రధాని మోదీ.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions