Sunday 2nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ధురంధర్’ మేజిక్: సినిమాపై రెండు దేశాధినేతల మధ్య ఆసక్తికర చర్చ!

‘ధురంధర్’ మేజిక్: సినిమాపై రెండు దేశాధినేతల మధ్య ఆసక్తికర చర్చ!

dhurandhar movie

Dhurandhar Global Reach | భారతీయ సినిమా సత్తా ఏపాటిదో మరోసారి ప్రపంచ వేదికపై నిరూపితమైంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురందర్’ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ నేతల మధ్య హాట్ టాపిక్ అయింది.

లండన్‌లోని ఒక పార్కులో సరదాగా జాగింగ్ చేస్తూ కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ జరిపారు.

ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ పెంచిన ‘ధురందర్’!

ఇటీవలే భారత్‌లో పర్యటించిన ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్, తన పర్యటన ముగించుకుని వెళ్లాక సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ఎలా ఉందని కెనడా ప్రధాని కార్నీ సరదాగా ప్రశ్నించారు.

దానికి స్టబ్ నవ్వుతూ.. “నా కుమారుడి సూచన మేరకు ‘ధురందర్’ సినిమా చూశానని పోస్ట్ చేసినప్పటి నుండి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోవర్లు భారీగా పెరిగిపోయారు!” అని సమాధానమిచ్చారు. ఈ క్రెడిట్ అంతా ఆ సినిమాదేనంటూ ఇద్దరు నేతలు నవ్వుకున్నారు.

గ్లోబల్ రీచ్ పొందిన ఆదిత్య ధర్ చిత్రం

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్’, కేవలం భారత్‌లోనే కాకుండా విదేశీయులను, ముఖ్యంగా ఇతర దేశాల అగ్రనేతలను సైతం ఆకర్షిస్తోంది.

ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ తన భారత పర్యటనలో ఈ సినిమా చూసి ఫిదా అవ్వడమే కాకుండా, దాని ప్రభావం తన సోషల్ మీడియాపై పడిందని స్వయంగా వెల్లడించడం విశేషం.

రణవీర్ సింగ్ నటన మరియు సినిమా మేకింగ్ వాల్యూస్ గ్లోబల్ లెవల్‌లో మెప్పిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం.

You may also like
అర నిమిషంలో 195ముద్దులు.. గిన్నిస్ బుక్‌లోకెక్కిన లవర్స్!
ఇండోనేషియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం!
స్లోవేకియాలో మోదీ.. ‘బ్రెడ్ & సాల్ట్’ సంప్రదాయంతో ఘన స్వాగతం!
ఇరాన్‌పై ట్రంప్ ‘బూతు’ పురాణం.. 48 గంటల డెడ్‌లైన్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions