- ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు!
Congress To meet CEO | తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ముఖ్య నేతలు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతుందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కి శనివారం తెలంగాన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ ను కలవనున్నారు.
ప్రభుత్వం మరియు ఇటువంటి బదిలీ పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయ్యనున్నారు. ప్రభుత్వ నుంచి బదిలీ అయ్యే డబ్బులపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నిధులను ఇతర మార్గాలకు, కాంట్రాక్టర్లకు మళ్ళిస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు.