Thursday 17th September 2026
12:07:03 PM
Home > తాజా > విద్యార్థినుల వీడియోల రికార్డ్..సీఎంఆర్ కాలేజీకి మూడురోజుల సెలవు

విద్యార్థినుల వీడియోల రికార్డ్..సీఎంఆర్ కాలేజీకి మూడురోజుల సెలవు

CMR College News Latest | మేడ్చల్ ( Medchal ) లోని కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ ( CMR College )లో వీడియోల రికార్డింగ్ అంశం కలకలం రేపుతోంది.

కాలేజి హాస్టల్ ( Hostel ) లోని బాత్రూం ( Bathroom ) వెంటిలేటర్ నుంచి తమను వీడియో తీశారంటూ విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగారు. విద్యార్థినులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇప్పటికే హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అదుపులోకి తీసుకున్న వారి ఫింగర్ప్రింట్స్ ( Fingerprints ) సేకరించారు.

స్టూడెంట్స్ ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలపడంతో గురువారం పరిస్థితి వేడెక్కింది. మరోవైపు మహిళా కమిషన్ కూడా సుమోటోగా కేసును స్వీకరించి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాలేజీకి మూడు రోజుల సెలవును ప్రకటించింది యాజమాన్యం.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions