Barrelakka News| తెలంగాణ ( Telangana ) ఎన్నికల ప్రచారం లో ఎక్కువగా వినిపించిన పేరు కర్నె శిరీష ( Karne Shirisha ) అలియాస్ బర్రెలక్క ( Barrelakka ).
కొల్లాపూర్ ( Kollapur ) నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ ( Nomination ) వేసిన ఆమెకు తొలుత అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా, ఆమె తమ్ముడి పై జరిగిన దాడి అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత, మేధావులు, వివిధ సంఘాలకు చెందిన వ్యక్తులు బర్రెలక్కకు మద్దతుగా నిలిచారు.
అలాగే ప్రచారం కోసం స్వచ్చందంగా అనేక మంది తరలి వచ్చారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అభ్యర్ధించారు బర్రెలక్క.
ఈ నేపథ్యంలో సాంఘిక మాధ్యమాల్లో ( Social Media ) ఆమెకు విశేష ఆదరణ లభించింది. అంతే కాకుండా ఒకానొక సమయంలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా నిలిచింది బర్రెలక్క.
ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క 5754 ఓట్లతో నాలుగోవ స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు ( Jupally Krishna Rao ) 29900 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
కాగా ఎటువంటి అంచనాలు లేకుండా, ఒంటరిగా బరిలోకి దిగి, డబ్బులు ఖర్చు చేయకుండా 5700 ఓట్లు సాధించిన బర్రెలక్కను అందరూ ప్రశంసిస్తుంన్నారు.