Tuesday 11th August 2026
12:07:03 PM
Home > తాజా > అంధ యువకుడికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బంపర్ ఆఫర్

అంధ యువకుడికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బంపర్ ఆఫర్

Music Director SS Thaman On Viral Blind Singer | టాలీవుడ్ ( Tollywood ) మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ( SS Thaman ) తన ఉదార మనసును చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ అంధ యువకుడు పాడిన పాట తెగ వైరల్ గా మారింది.

రామ రామ రఘురామ అంటూ అంధ యువకుడు అద్భుతంగా పాడిన వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ( Sajjanar ) ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు. అలాగే ఈ యువకుడికి ఎవరైనా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఎస్ఎస్ థమన్ స్పందించారు.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ( Platform ) ఆహా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ లో సదరు యువకుడితో స్పెషల్ ( Special ) ప్రదర్శన ఏర్పాటు చేస్తామని థమన్ పేర్కొన్నారు. అంతేకాకుండా అతడితో కలిసి తాను కూడా పాడుతానని చెప్పారు.

అలాగే అంధ యువకుడి అద్భుత గాత్రాన్ని కొనియాడారు. ఈ క్రమంలో స్పందించిన సజ్జనర్ భవిష్యత్ లో త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల‌ను చేస్తూ ఈ యువకుడు ఉన్న‌తంగా ఎదగాలని ఆశించారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions