Saturday 27th July 2024
12:07:03 PM
Home > బిజినెస్ > Photofina 2023: విజయవంతంగా ముగిసిన “ఫొటోఫినా” ఎగ్జిబిషన్!

Photofina 2023: విజయవంతంగా ముగిసిన “ఫొటోఫినా” ఎగ్జిబిషన్!

Photofina

– మూడో రోజూ సందర్శకుల నుంచి విశేష స్పందన..

– వీకెండ్ కావడంతో భారీగా హాజరైన ఫొటో ప్రియులు

–  విజటర్లకు ఉచితంగా హెల్త్ కార్డులు పంపిణీ చేసిన కేబీకే హాస్పిటల్

హైదరాబాద్/నార్సింగి: కేబీకే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ (KBK Multispecialty Hospital) సౌజన్యంతో తెలంగాణ సాంస్కృతిక శాఖ, ఎడిట్ పాయింట్ ఆధ్వర్యంలో మూడు రోజుల మెగా ఫొటో ట్రేడ్ ఎగ్జిబిషన్ “ఫొటోఫినా-2023” (PhotoFina) విజయవంతంగా ముగిసింది.

హైదరాబాద్ నార్సింగి లోని ది అడ్రస్ కన్వెషన్స్ లో నిర్వహించిన ఈ ఫొటోఫినా ఎగ్జిబిషన్ కు శనివారం మూడో రోజు కూడా విశేష స్పందన లభించింది.

రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, ముఖ్య పట్టణాల నించి ఫొటోగ్రాఫర్లు, ఫొటోగ్రఫీ పై ఆసక్తి ఉన్న వారు వేల సంఖ్యలో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఫొటోఫినా నిర్వాహకులు ఎడిట్ పాయింట్ అధినేత ఇప్పలపల్లి రమేశ్ మాట్లాడుతూ ఫొటో ట్రేడ్ కు సందర్శకుల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందన్నారు. మొత్తం మూడు రోజుల్లో సుమారు 20 వేలకు పైగా ఈ ఫొటోఫినాను సందర్శించారని తెలిపారు.

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి కూడా ఫొటోగ్రాఫర్లు ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారని రమేశ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే అన్ని రకాల కెమెరాల గురించి ఈ ఎగ్జిబిషన్ లో ఔత్సాహికులు తెలుసుకున్నారని వివరించారు.

సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించడంతోపాటు దూరం నుంచి వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించామని వివరించారు. ఈ ఫొటోఫినాకు ప్రధాన స్పాన్సర్ అయిన కేబీకే హాస్పిటల్ వ్యవస్థాపకులు, కేబీకే గ్రూప్ సీఈవో డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సందర్శకులకు ఉచితంగా కేబీకే హాస్పిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఫొటోట్రేడ్ ఎగ్జిబిషన్ కు సహకరించిన మిగతా స్పాన్సర్లు, పాల్గొన్న వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

వచ్చే ఏడాది మరో మంచి వేదికలో ఈ ఫొటోఫినా ఎగ్జిబిషన్ ను మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని రమేశ్ తెలిపారు.

కేబీకే హాస్పిటల్ ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ..

గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్ లాంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి అవయవాలను కాపాడాలనే సంకల్పంతో కేబీకే హాస్పిటల్ సందర్శకుల కోసం ఉచితంగా తమ హాస్పిటల్ ఉచిత హెల్త్ కార్డులను పంపిణీ చేసింది. ఈ అవకాశాన్ని సందర్శకులు వినియోగించుకున్నారు. అదేవిధంగా అవయవాలు కాపాడాలనే సంకల్పంతో కేబీకే హాస్పిటల్ చేపట్టిన “సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్” క్యాంపెయిన్ పోస్టర్ ఆవిష్కరణలో సందర్శకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కేబీకే హాస్పిటల్ డైరెక్టర్, వైద్యులకు భీష్మ వశిష్ట పురస్కార్ అవార్డులు..

ఫొటోఫినా ఎగ్జిబిషన్ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు వందేభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీష్మ వశిష్ట పురస్కారాలు అందజేశారు. అందులో భాగంగా పలు దీర్ఘకాలిక వ్యాధులకు ఆంప్యుటేషన్ రహితంగా అత్యాధునిక చికిత్స అందజేస్తున్న కేబీకే హాస్పిటల్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస చారికి, సీనియర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వెంకట్ రెడ్డికి ఈ భీష్మ వశిష్ట అవార్డులు దక్కాయి.

కేబీకే హాస్పిటల్ ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ..

గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్ లాంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి అవయవాలను కాపాడాలనే సంకల్పంతో కేబీకే హాస్పిటల్ సందర్శకుల కోసం ఉచితంగా తమ హాస్పిటల్ ఉచిత హెల్త్ కార్డులను పంపిణీ చేసింది. ఈ అవకాశాన్ని సందర్శకులు వినియోగించుకున్నారు. అదేవిధంగా అవయవాలు కాపాడాలనే సంకల్పంతో కేబీకే హాస్పిటల్ చేపట్టిన “సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్” క్యాంపెయిన్ పోస్టర్ ఆవిష్కరణలో సందర్శకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions