Nara Lokesh Emotional Post | తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో విషాదం నెలకొంది. పర్చూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ యువ నేత, నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు వేంపరాల జితేంద్ర పవన్ కుమార్ (Jitendra Pawan Kumar) గుండెపోటుతో అకాల మరణం చెందారు.
ఆయన మృతి పట్ల ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జితేంద్రకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
“తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెడతావు. టీడీపీ జెండా పట్టుకుని సైనికుడిలా ముందుండి నడిచావు. ఇంత చిన్న వయస్సులో అందరినీ వదిలి ఎలా వెళ్లావురా?
పర్చూరు నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడిగా నీ పోరాటం.. పార్టీ నాయకులు చెబుతుంటే ఎంత గొప్ప పసుపు సైనికుడిని కోల్పోయామో అర్థమవుతోంది. we miss you raa వేంపరాల జితేంద్ర పవన్ కుమార్.
గుండెపోటుతో మృతి చెందిన నీకు హృదయపూర్వక నివాళులు. నువ్వు లేని విషాదాన్ని మోస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను” అంటూ నారా లోకేశ్ తన సంతాపాన్ని ప్రకటించారు.









