Friday 1st May 2026
12:07:03 PM
Home > తెలంగాణ > అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప..

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప..

Annadana Lord take refuge Ayyappa..
  • అన్నదాత ఎల్మేటి జైపాల్‌రెడ్డి
  • దేవాలయం నిర్మాణానికి రూ.5 లక్షల భారీ విరాళం

కొత్తూరు: నలభై ఐదు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప మాలలు ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామానికి చెందిన ఎల్మేటి జైపాల్‌ రెడ్డి తెలిపారు. నందిగామ మండలంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం పురస్కరించుకొని జైపాల్‌ రెడ్డి వెయ్యి మంది అయ్యప్ప స్వాములకు శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా అయ్యప్ప స్వామి ఆలయానికి వారి కుటుంబ సభ్యులతో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప మాలలు ధరించిన, అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, అయ్యప్ప స్వామి దయ ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులపై ఉండాలని వేడుకున్నారు. అయ్యప్ప ఆశీస్సులతో ప్రతియేటా అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్పస్వామి దేవాలయం నిర్మాణానికి రూ,5 లక్షల భారీ విరాళాన్ని గురుబ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ సతిషన్‌ నాయర్‌ గురుస్వామి కుమారుడు శ్రీ గీరిషన్‌ నాయర్‌ గురుస్వామి కి చెక్కును అందజేశారు. జైపాల్‌ రెడ్డి,సునీత రెడ్డి,కుమారుడు తనీష్‌ రెడ్డి లను దేవాలయం కమిటీ సభ్యులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సురేందర్‌ రెడ్డి, వావిలాల హరిజీవన్‌, బాతుక లక్ష్మయ్య యాదవ్‌, ఎదిర శ్రీకాంత్‌ గౌడ్‌,వంకాయల రాంరెడ్డి,బంట్రపు జంగయ్య గౌడ్‌,వడ్ల రమేష్‌ చారి,చించేటి కృష్ణ, బి,కృష్ణ, నవాబ్‌ పేట శేఖర్‌ గౌడ్‌,నారాయణ గౌడ్‌, కావలి మల్లేష్‌,కావలి ప్రభాకర్‌,నిరంజన్‌ గౌడ్‌,శివకుమార్‌, నాట్కో శ్రీనివాస్‌,వన్నం బాలరాజు, పోచయ్య,దాస్‌,దేవాలయం పూజారి షణ్ముకం స్వామి తదితరులు పాల్గొన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions