Friday 25th September 2026
12:07:03 PM
Home > తాజా >  “జీవితం ఇద్దరు అన్నయ్యలను ఇచ్చింది” మెగా బ్రదర్స్ పై అన్నా లెజినోవా పోస్ట్!

 “జీవితం ఇద్దరు అన్నయ్యలను ఇచ్చింది” మెగా బ్రదర్స్ పై అన్నా లెజినోవా పోస్ట్!

anna lezhineva

Anna Lezhneva | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు.

అకౌంట్ తెరిచిన కొద్దిసేపటికే, ఆమె చేసిన మొదటి పోస్ట్ మెగా అభిమానులతో పాటు నెటిజన్లందరి దృష్టిని ఆకర్షించి, ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ పోస్ట్‌ లో మెగాస్టార్ చిరంజీవి మరియు నాగబాబులతో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఆమె అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. మెగా కుటుంబంలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నా తన అనుభవాలను పంచుకున్నారు.

“నేను మెగా కుటుంబంలోకి వచ్చిన కొత్తలో ఎవరిని ఏమని పిలవాలో నాకు తెలియలేదు. నా భర్త  పవన్ కల్యాణ్  వాడే మాటలనే నేనూ వాడాను… అన్నయ్య, చిన్నన్నయ్య!. మొదట అవి కేవలం మాటలే అయినా, కాలక్రమేణా అవే నా భావాలయ్యాయి.

నాకు సొంత సోదరులు లేరు. కానీ జీవితం నాకు ఇద్దరిని ఇచ్చింది” అంటూ చిరంజీవి మరియు నాగబాబులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగబాబులతో కలిసున్న పాత మరియు కొత్త ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు.  

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions