Saturday 2nd May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > లేఆఫ్స్ కలకలం..ఉద్యోగులపై అమెజాన్ వేటు

లేఆఫ్స్ కలకలం..ఉద్యోగులపై అమెజాన్ వేటు

Amazon To Cut 14000 More Jobs Next Week | దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరికొద్ది రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జనవరి 27న సుమారు 16 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సదరు సంస్థ సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతుంది. హ్యూమన్ రీసోర్సెస్, ప్రైమ్ వీడియో, వెబ్ సర్వీసెస్ మొదలైన విభాగాల్లో తొలగింపులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అన్ని విభాగాల కలుపుకొని అమెజాన్ లో 3,50,000 మంది కార్పోరేట్ ఉద్యోగులు ఉన్నారు.

అయితే వీరిలో 10శాతం మందిని తొలగించాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తుంది అని గతేడాది అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అనంతరం అమెజాన్ సంస్థ 14 వేల మందిని తొలగించింది. ఇకపోతే జనవరి 27న మరో 16 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions