Ajith Kumar Waves The Indian Flag After Dubai 24H Race Win | తమిళ నటుడు అజిత్ ( Ajith ) అద్భుత విజయాన్ని నమోదు చేశారు. దుబాయ్ కారు రేసింగ్ ( Dubai Car Racing ) లో ఈ స్టార్ హీరో సత్తా చాటడంతో ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవలే ఒక టీంను ప్రకటించిన నటుడు అజిత్ దుబాయ్ వేదికగా జరుగుతున్న 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్ ( Dubai 24H Race ) లో పాల్గొని టాప్ ప్లేస్ లో నిలిచారు.
కారు రేస్ కంటే రెండు రోజుల ముందు బ్రేక్ ఫెయిల్ కావడంతో అజిత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. అనంతరం వెంటనే కోలుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రేసింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు అజిత్.
జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. అలాగే సతీమణి షాలిని ను ఆప్యాయంగా హత్తుకుని థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.