Thursday 30th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కుంభమేళా ఆరంభం..త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు

కుంభమేళా ఆరంభం..త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు

Mahakumbh 2025 News | ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజామున నుండి ఘనంగా ఆరంభమయ్యింది.

యూపీ ( Uttar Pradesh ) ప్రయాగ్ రాజ్ ( Prayagraj )లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్దకు భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకే సుమారు 35 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తంగా 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు హాజరవుతారని యూపీ సర్కారు అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. కేవలం మన దేశం నుండే కాకుండా ప్రపంచ దేశాల నుండి పర్యాటకులు రానున్నారు.

భక్తుల మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పించేందుకు నదిలో తేలియాడే పోలీసు స్టేషన్, చిన్న చిన్న పడవల్లో సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు.

You may also like
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions