Friday 27th November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని మోదీ తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలి: నాగార్జున

ప్రధాని మోదీ తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలి: నాగార్జున

Nagarjuna In Nasha Mukt Bharat దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున, డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కిషన్ రెడ్డి కార్యక్రమానికి ప్రశంసలు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన నషా ముక్త్ భారత్ కార్యక్రమం ఎంతో మంచి ఆలోచనతో ప్రారంభమైందని నాగార్జున అభినందించారు. గత రెండు రోజులుగా ఈ యాత్రను గమనిస్తున్నానని, పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత ఇందులో భాగస్వాములవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసమే..

దేశం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తొలగించాలనే గొప్ప సంకల్పంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములై ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది వారి భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమమని స్పష్టం చేశారు.

డ్రగ్స్ రహిత భారతదేశం కోసం కిషన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని, ఈ గొప్ప సంకల్పానికి అందరూ తమ సంపూర్ణ మద్దతు అందించాలని నాగార్జున విజ్ఞప్తి చేశారు.

You may also like
2029 నాటికి ‘నషా ముక్త భారత్’: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions