Thursday 12th November 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు ఇదే!

ఏపీలో కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు ఇదే!

Vijayasai Reddy Party Name ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఊహించినట్లుగానే ఆయన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన నూతన పార్టీకి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (Parivarthana Rajaneethi Party – PRP) అని పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు. పార్టీ జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తుతో పాటు తెలుపు, కాషాయ రంగులతో రూపుదిద్దుకున్న జెండాను ఆయన ఆవిష్కరించారు.

దేవతల సాక్షిగా ఆవిర్భావం..

దేవతల సాక్షిగా తన నూతన పార్టీని ప్రారంభించానని, రాష్ట్రంలో మార్పు అనేది ప్రజలే తీసుకురావాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. “ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును కేవలం రెండు కుటుంబాలే (నారా, వైఎస్ కుటుంబాలు) శాసిస్తున్నాయి. ఆ కుటుంబాల ఆధిపత్యం నశించాలి. తండ్రి సీఎం అయితే కొడుకే సీఎం కావాలా? నాయకత్వ పదవులు వారసత్వంగా రాకూడదు” అని ప్రశ్నించారు.

యువతకే సీఎం పీఠం..

ప్రతి కులంలోనూ, ప్రతి సామాజిక వర్గంలోనూ సమర్థులైన నాయకులు ఉన్నారని.. యువతలోని నాయకత్వ లక్షణాలను వెలికితీసి, సామర్థ్యం ఉన్న యువకుడినే ముఖ్యమంత్రిని చేయడమే పీఆర్పీ (PRP) ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఓటు వేయడంతోనే ప్రజల పాత్ర ముగిసిపోదని, తప్పు ఎవరు చేసినా నిలదీసి ప్రశ్నించాల్సిందేనని అన్నారు. అది తానైనా, సీఎం చంద్రబాబు అయినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా నిలదీసే హక్కు ప్రజలకు ఉందన్నారు.

రాజకీయంలో ప్రళయం ఖాయం..

వైసీపీ నిర్మాణంలో తాను క్రియాశీలకంగా పనిచేశానని గుర్తుచేసిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు బయటకు వచ్చానని, అక్కడి నుంచి వచ్చే నిబద్ధత గల నాయకులకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద ప్రళయం, ప్రకంపనలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175కి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీఆర్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో 26 కులాలను బీసీల నుంచి తొలగించిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని పేర్కొన్నారు.

You may also like
ap cm chandrababu
అది సాధిస్తే రూ. 100 కోట్లు ఇస్తాం.. సీఎం చంద్రబాబు ఆఫర్!
pawan kaylan as abhinava krihsna devaraya
పవన్ కు ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు!
kiran chebrolu
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ కార్యకర్త అరెస్టు!
పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions