Thursday 1st October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్!

వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్!

  • రీఛార్జ్ చేసుకుంటే రూ.1 లక్ష ఉచిత ప్రమాద బీమా, సైబర్ కవరేజ్!

BSNL Free Insurance Prepaid Plans ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఒక సంచలనాత్మక ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఎంపిక చేసిన రెండు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ఏకంగా రూ.1 లక్ష ఉచిత ప్రమాద మరణ బీమాతో పాటు రూ.10,000 సైబర్ ఫ్రాడ్ కవరేజీని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్ అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది.

దేశంలో ఒక టెలికాం ఆపరేటర్ రీఛార్జ్ ప్లాన్‌‌తో ఉచితంగా బీమా సదుపాయం కల్పించడం ఇదే తొలిసారి అని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

ఓరియంటల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం..

ఈ ఆఫర్ కోసం బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రముఖ ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ‘ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (OICL)తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1 లక్ష ప్రమాద బీమా: అర్హత కలిగిన ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకున్న చందాదారులకు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1 లక్ష వరకు క్లెయిమ్ లభిస్తుంది.

రూ.10,000 సైబర్ కవర్..

బీఎస్ఎన్ఎల్ నంబర్ ఉపయోగించి జరిగిన ఆన్‌లైన్ ఆర్థిక మోసాల నుంచి రక్షణగా రూ.10,000 వరకు కవరేజీని ఇస్తున్నారు. కస్టమర్లు ఈ బీమా ప్రయోజనాలను పొందాలంటే కింద పేర్కొన్న రెండు ప్రత్యేక టారిఫ్ వోచర్ల (STV)లో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

STV 202 (30 రోజుల వ్యాలిడిటీ): ఈ ప్లాన్‌లో 300 నిమిషాల వాయిస్ కాల్స్, 5 GB డేటా, 100 SMSలతో పాటు ఉచిత బీమా మరియు సైబర్ కవర్ లభిస్తాయి.

STV 2449 (365 రోజుల వ్యాలిడిటీ – వార్షిక ప్లాన్): ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 GB డేటా, 100 SMSలు మరియు ఉచిత బీమా సదుపాయం అందుబాటులో ఉంటాయి.

కస్టమర్ రీఛార్జ్ చేసుకున్న వెంటనే బీమా పాలసీ యాక్టివేట్ అవుతుంది. పాలసీ వివరాలు కన్ఫర్మేషన్ SMS ద్వారా అందుతాయి. ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత కాలం ఈ బీమా వర్తిస్తుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల పోటీని తట్టుకునేందుకు BSNL ఈ వ్యూహాత్మక అడుగు వేసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions