Tuesday 29th September 2026
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్‌కు మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈసీపై నిందలు!

కాంగ్రెస్‌కు మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈసీపై నిందలు!

  • కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు!

Bandi Sanjay Comments On Congress కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై బురద చల్లుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌పై పదేపదే నిందలు వేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) దివాళాకోరు రాజకీయం చేస్తోందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోనే ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

మోదీ ఎందుకు రాజీనామా చేయాలి?

దేశ ప్రజలు వరుసగా మూడుసార్లు అప్రతిహతంగా గెలిపించినందుకు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినందుకు, దేశాన్ని ఆర్థిక ప్రగతిలో అగ్రపథాన నిలిపినందుకు ప్రధాని మోదీ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని బ్రిటీష్ పాలనతో పోల్చడం, ఈసీని సైమన్ కమిషన్‌తో పోల్చడం తీవ్రంగా ఖండించదగినవని, ఇటలీ మూలాలు ఉన్న నేతలకు భారత ప్రజాస్వామ్యం అంటే చులకన భావమని ఎద్దేవా చేశారు.

కర్ణాటక, తెలంగాణలో గెలిచినప్పుడు గుర్తురాలేదా?

కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంల లోపాలు, ఈసీ వైఫల్యాలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. కేరళలో SIR ప్రక్రియ వల్లే కాంగ్రెస్ గెలిచిందని అక్కడి నేత రమేశ్ చెన్నితలా ప్రశంసించిన విషయాన్ని సీడబ్ల్యూసీ గుర్తుచేసుకోవాలన్నారు.

SIR అనేది కొత్త ప్రక్రియ ఏమీ కాదని, ఓటర్ల జాబితాలో డూప్లికేట్, బోగస్ ఓటర్లు లేకుండా చేసి అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) కూడా అవకాశం ఉందన్నారు.

You may also like
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
వందేమాతరానికి అవమానంపై చర్యలేవి?
bandi sanjay kumar
అభివృద్ధి మా విధానం… హిందుత్వం మా నినాదం!
vc sajjanar
వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు: వీసీ సజ్జనార్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions