- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటన!
Lionel Messi Retires From International Football అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 20 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఎనలేని సేవలు అందించిన ఈ లెజెండరీ ఆటగాడు, తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు స్వయంగా వెల్లడించారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మెస్సీ భావోద్వేగ సందేశం..
తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ಖాతా వేదికగా మెస్సీ ఈ నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నారు. “ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధ కలిగిస్తున్నప్పటికీ.. నా కెరీర్‌లో ఇది సరైన సమయం మరియు సరైన నిర్ణయం” అని మెస్సీ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) తనపై చూపించిన అపారమైన ప్రేమ, మద్దతుకు అభిమానులకు మరియు దేశ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విషాదంలో ఫుట్‌బాల్ ప్రపంచం..
అర్జెంటీనాకు ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‌తో పాటు ఎన్నో చారిత్రాత్మక విజయాలు, మైలురాళ్లను అందించిన మెస్సీ నిష్క్రమణతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రేమికులు, అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.









