RAPO23 Title ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి వెండితెరపై నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మెగాఫోన్ పట్టి సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమవుతున్నారు. రామ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘RAPO23’ వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
24 గంటల నాన్‌స్టాప్ షూటింగ్..
ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇటీవల పాండిచ్చేరి పరిసర ప్రాంతాలలో జరిగిన షెడ్యూల్లో ఏకంగా 24 గంటల పాటు నాన్‌స్టాప్ షూటింగ్లో పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచారు.
సినిమా ఔట్పుట్ అద్భుతంగా రావాలనే పట్టుదలతో ఎక్కడా విరామం తీసుకోకుండా ఆయన వర్క్ చేస్తున్న తీరు ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పరిశీలనలో క్రేజీ టైటిల్..
ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశానికి పర్ఫెక్ట్గా సరిపోయేలా ‘ఏక – ది లోన్ వోల్ఫ్’ (EKA – The Lone Wolf) అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమా టోన్‌కు ఈ పేరు పక్కాగా సెట్ అవుతుందని భావిస్తున్నప్పటికీ, దీనిపై చిత్ర యూనిట్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
చీకటి ప్రపంచం నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన ‘నియో-నోయిర్’ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై కృష్ణ పోతినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విలక్షణ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ (Sam C.S.) స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు తిరు విజువల్స్ అందిస్తున్నారు.







