Thursday 20th August 2026
12:07:03 PM
Home > తాజా > HYDERABAD: సామాన్యుడిలా బైక్‌పై నగర సీపీ సజ్జనర్!

HYDERABAD: సామాన్యుడిలా బైక్‌పై నగర సీపీ సజ్జనర్!

  • కేబీఆర్ పార్క్ వన్ వే ట్రాఫిక్ పరిశీలన!

CP Sajjanar KBR Park Traffic Inspection కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించారు.

క్షేత్రస్థాయి పర్యవేక్షణ వివరాలు..

సీపీ సజ్జనర్ బైక్‌పై కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రెండుసార్లు తిరుగుతూ ట్రాఫిక్ నిశితంగా పరిశీలించారు. రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు ఆయన ప్రయాణించారు.

మధ్యాహ్నం వేళల్లో కూడా మరోసారి ట్రాఫిక్ సరళిని పరిశీలించిన సీపీ.. జంక్షన్లలో విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

పర్యవేక్షణ అనంతరం సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడారు. బుధవారం నుంచి అమలులోకి తెచ్చిన వన్‌వే విధానం గురువారం నాటికి పూర్తిగా సాఫీగా సాగుతోందని వెల్లడించారు. మొదటి రోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని తెలిపారు.

వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని మోహరించినట్లు వివరించారు.

జీహెచ్‌ఎంసీ, నిర్మాణ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులు పూర్తయ్యేంత వరకు వాహనదారులు సహకరించి ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

You may also like
కేబీఆర్ పార్కు వద్ద వన్ వే ట్రాఫిక్.. వాకర్స్‌తో ట్రాఫిక్ పోలీసుల భేటీ!
సికింద్రాబాద్ బోనాలు.. ఆగస్టు 2-4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు!
traffic challans
వాహనదారులకు అలర్ట్.. మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions