Udhayanidhi Stalin Controversy | తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి.
కావేరి జలాల అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో ప్రేక్షకులు “త్రిష.. త్రిష” అంటూ నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం జోసెఫ్ విజయ్‌తో పాటు నటి త్రిషను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్య చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
TVK ఎమ్మెల్యే రేవంత్ చరణ్ స్పందించారు. ఈ వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఇది రాజకీయ సంస్కృతికి మచ్చ అని విమర్శించారు.
బీజేపీ తమిళనాడు ప్రధాన అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి కూడా తీవ్రంగా స్పందించారు. ఉదయనిధిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం కూడా వ్యాఖ్యలను ఖండించారు. సినీ కళాకారుల సంఘం దీనిపై స్పందించాలని కోరారు.
మూడేళ్ల క్రితం సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో కూడా ఉదయనిధి తీవ్ర వివాదంలో నిలిచారు. తాజాగా మరోసారి ఆయన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.











