Friday 11th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > డీప్‌ఫేక్స్, పరువు నష్టం పోస్టులపై బొంబాయి హైకోర్టుకు నితిన్ గడ్కరీ!

డీప్‌ఫేక్స్, పరువు నష్టం పోస్టులపై బొంబాయి హైకోర్టుకు నితిన్ గడ్కరీ!

nithin

Nitin Gadkari On Deepfakes | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై సోషల్ మీడియాలో వస్తున్న పరువు నష్టం కలిగించే పోస్టులు, డీప్‌ఫేక్స్ పై బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.

E20 ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ద్వారా ఆయన, ఆయన కుటుంబం లాభపడుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై మెటా మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై సివిల్ దావా వేసేందుకు జస్టిస్ అభయ్ అహుజా అనుమతి ఇచ్చారు. క్లాజ్ XII నిబంధన కింద ఈ దావా దాఖలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పెట్రోలియం శాఖ పరిధిలోని E20 కార్యక్రమంతో గడ్కరీకి వ్యక్తిగత లాభాలు ఉన్నాయంటూ ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు రెండు వారాల క్రితమే నాగ్‌పూర్‌లో పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్, ‘దేశీ బాయ్స్’ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్, హర్షిత్ రాఠీ, అంక్లేష్ ఇన్వతీలపై కేసు నమోదు చేశారు. 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల పాత వాహనాలకు నష్టం జరుగుతుందని ఇన్‌ఫ్లుయెన్సర్లు విమర్శలు చేయగా, ఇది పర్యావరణానికి సురక్షితమని కేంద్రం పునరుద్ఘాటించింది.

You may also like
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!
అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!
‘విజయ్ ఫర్ పీఎం’ నినాదంపై చెలరేగిన రాజకీయ వివాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions