- చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి!
Yadagirigutta Temple New Trust Board | తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (యాదాద్రి) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి నూతన ట్రస్ట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఏర్పాటు చేసింది.
ఈ నూతన బోర్డు చైర్మన్‌గా ఎం. సత్యనారాయణ రెడ్డిని నియమించడంతో పాటు, మరో 18 మందిని సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ నూతన ధర్మకర్తల మండలిలో (Trust Board) రాజకీయ, సామాజిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులకు స్థానం లభించింది.
సభ్యులుగా నియమితులైన వారిలో ముఖ్యులు:
ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి
కొణిదెల సురేఖ ( నటుడు చిరంజీవి సతీమణి)
చిలప్పగారి విజయ రాజం
విజయేందర్ తుళ్ల
పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్
గుండు మల్లయ్య
స్వాతి కాంతామణి
ఎం. రాఘవేందర్ రావు
డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్
పదవీరీత్యా (Ex-Officio) కొనసాగే సభ్యులు..
రాజకీయ నియామకాలతో పాటు ఆలయ పరిపాలన, ప్రభుత్వ సమన్వయం కోసం పలువురు ఉన్నతాధికారులు మరియు అర్చకులు ఈ బోర్డులో పదవీరీత్యా (Ex-officio) సభ్యులుగా కొనసాగుతారు.
వ్యవస్థాపక ట్రస్టీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్య కార్యదర్శి దేవాదాయ శాఖ కమిషనర్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ (YTDA) వైస్-ఛైర్మన్ యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) స్థానాచార్యులు (అత్యంత సీనియర్ ప్రధాన అర్చకులు)
రెండేళ్ల పాటు బోర్డు పదవీకాలం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ రెండేళ్ల కాలంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన, మరియు ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఈ బోర్డు పర్యవేక్షించనుంది.







