Saturday 27th July 2024
12:07:03 PM
Home > ఇతర విభాగాలు > ఈ వేసవిలో కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీ మీకోసం!

ఈ వేసవిలో కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీ మీకోసం!

irctc kerala tour package
  • కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరుతో ప్యాకేజీ ప్రకటించిన రైల్వే టూరిజం
  • 5 రాత్రులు 6 రోజుల టూర్
  • ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న శబరి ఎక్స్ ప్రెస్

హైదరాబాద్: వేసవి (Summer) వచ్చిందంటే చాలు విద్యార్థులకు అదో పెద్ద పండుగ. దాదాపు నెల రోజుల పండుగను హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.

ఓవైపు ఎండలు మండుతున్నా.. ఏడాది మొత్తం స్కూళ్లు కాలేజీల్లో  చదువులతో అలసిపోయిన విద్యార్థులు ఈ నెల రోజులపాటు ఆటలు పాటలు టూర్లతో బిజీగా గడుపుతారు. పిల్లలకు సెలవులు కావడంతో పెద్దలు కూడా ఏదైనా లాంగ్ టూర్ కి ప్లాన్ చేస్తుంటారు.

ప్రతి ఏటా వేసవి వచ్చిందంటే వెంటనే గుర్తొచ్చే సమ్మర్ వెకేషన్స్ ఊటి (Ooty). అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు కేరళను (Kerala) సందర్శించడానికి ఇష్టపడుతున్నారు.

ముఖ్యంగా దేవభూమిగా పేరొందిన కేరళలో ప్రకృతి అందాలు, నదుల్లో బోట్ షికార్లు, తేయాకు తోటల్లో విహరించాడానికి మొగ్గుచూపుతున్నారు.

ఈ నేపథ్యంలో కేరళను సందర్శించే వారికోసం ఒక్క కొత్త టూర్ ప్యాకేజీని (Kerala Tour Package) ప్రవేశపెట్టింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).

మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా కేరళ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

IRCTC ఈ టూర్ ప్యాకేజీని KERALA HILLS & WATERS పేరుతో తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మే 9 నుండి జూన్ 27 వరకు అందుబాటులో ఉంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి నడుస్తుంది.

పర్యాటకులు గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్ మరియు తెనాలి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఎక్కవచ్చు. కేర‌ళ ప్రయాణం పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న రైల్వే స్టేష‌న్లలోనే మ‌ళ్లీ దిగే వెసులుబాటు ఉంది.

ఈ పర్యటన ఐదు రాత్రులు మరియు ఆరు పగళ్లు కొనసాగుతుంది.

ఈ కేరళ టూర్ రైలు మే 9 నుండి వారానికి ఒకసారి సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. సమయం మరియు టిక్కెట్ల లభ్యతను బట్టి మీకు నచ్చిన తేదీని ఎంచుకోవచ్చు.

శబరి ఎక్స్‌ ప్రెస్ ఈ టూర్ కాలంలో ప్రతి మంగళవారం అంటే మే 9, 16, 23, 30 మరియు జూన్ 27 వరకు ప్రయాణిస్తుంది.

త్రీ-టైర్ AC మరియు స్లీపర్ తరగతుల్లో ప్రయాణానికి టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఇది సాధారణ రైలు అయినప్పటికీ, ప్రతి మంగళవారం పర్యాటకుల కోసమే ప్రత్యేకంగా కేటాయించబడింది.

కేరళ ప్రయాణం సాగేదిలా..

ఈ శబర్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం.17230) రైలు టూర్ ప్యాకేజ్ ఉన్నన్ని రోజులూ ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నిర్దిష్ట తేదీల్లో మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరుతుంది.  

రైలు రెండో రోజు మధ్యాహ్నం 12:55 గంటలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ IRCTC సిబ్బంది మున్నార్ చేరుకుంటారు. ముందుగా బుక్ చేసుకున్న హోటల్‌లో వసతి ఏర్పాటు చేస్తారు. అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ రాత్రి మున్నార్ హోటల్‌లో బస చేస్తారు.

మూడో రోజు, హోటల్‌లో అల్పాహారం తర్వాత, ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం మరియు మట్టుపెట్టి డ్యామ్ సందర్శనతో పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ హోటల్‌లో సేదతీరుతారు.

నాలుగో రోజు ఉదయానికి అలెప్పి చేరుకుంటారు. హోటల్‌లో అల్పాహారం తీసుకున్న తర్వాత అలెప్పీ అందాలను చూసేందుకు వెళ్తారు. దీంతో నాలుగో రోజు పర్యటన ముగుస్తుంది. రాత్రిపూట మళ్లీ హోటల్‌లో బస.

ఐదో రోజు, అలెప్పీ నుండి ఎర్నాకులం రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ రాత్రి 11:20 గంటలకు శబరి ఎక్స్‌ ప్రెస్ బయలుదేరుతుంది.

ఆరో తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ఛార్జీ ల వివరాలు ఇవీ!

సింగిల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి రూ. 32,230

ట్విన్ షేరింగ్ అయితే కోసం రూ. 18,740

ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 15,130

5-11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, ఒకరికి బెడ్ తో అయితే రూ.8,730, బెడ్ అవసరం లేదనుకుంటే రూ.6,530 చెల్లించాల్సి ఉంటుంది.

కేరళలో మూడు రాత్రులు ఉండటానికి గదులు, ఉదయం టిఫిన్స్ ఉచితంగా లభిస్తుంది. మధ్యహ్నం, రాత్రి భోజనం మాత్రం టూరిస్టులే భరించాలి.

పర్యాటక ప్రదేశాల్లో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉంటే యాత్రికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. గైడ్ ను టూరిస్టులే ఏర్పాటు చేసుకోవాలి. బోటింగ్, హార్స్ రైడింగ్ వంటివి ప్యాకేజీలో ఉండవు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions