Friday 22nd May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కాక్రోచ్ జనతా పార్టీ నుంచి మాజీ ఐఏఎస్ అవుట్!

కాక్రోచ్ జనతా పార్టీ నుంచి మాజీ ఐఏఎస్ అవుట్!

  • CJP వెనుక ‘ఆప్’ మాస్టర్‌ప్లాన్ ఉందా?..
  • కేజ్రీవాల్ పిలుపు.. సిసోడియా రీల్స్ వెనుక అసలు కథ!

Ashish Joshi Quits CJP | సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, రాజకీయ దిగ్గజాలకు నిద్రలేకుండా చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చుట్టూ అనుమానాల మేఘాలు ముసురుకుంటున్నాయి.

కేవలం మీమ్స్, సెటైర్లతో ప్రారంభమైన ఈ డిజిటల్ విప్లవం.. నిజంగానే యువత ఆక్రోశమా? లేక అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నడిపిస్తున్న ఒక “కోవర్ట్ పొలిటికల్ ప్రాజెక్ట్” (రహస్య రాజకీయ ప్రయోగమా) అనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.

సిజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ‘ఆప్’ (AAP) తో ఉన్న పాత సంబంధాలే ఈ అనుమానాలకు ప్రధాన కారణం కాగా.. ఈ ఉద్యమాన్ని నమ్మి మొదట్లో సపోర్ట్ చేసిన పలువురు మేధావులు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు.

షాక్ ఇచ్చిన మాజీ సివిల్ సర్వెంట్ ఆశిష్ జోషి..
ఈ మూవ్‌మెంట్‌కు మొదట్లో అండగా నిలిచిన మాజీ సివిల్ సర్వెంట్ ఆశిష్ జోషి, సిజేపీ స్వతంత్రతపై బహిరంగంగానే ప్రశ్నలు లేవనెత్తారు.

“సిజేపీ అనేది ఆప్ (AAP) అంతర్గత వ్యూహంలో భాగమని చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. దీనిపై 24 గంటల్లో క్లారిటీ ఇవ్వండి” అంటూ అభిజీత్ దీప్కేకు ఆయన అల్టిమేటం ఇచ్చారు.

మద్దతు ఉపసంహరణ..
అయితే అభిజీత్ నుంచి ఎలాంటి స్పష్టమైన వివరణ రాకపోవడంతో ఆశిష్ జోషి గురువారం రాత్రి సంచలన ప్రకటన చేశారు.

“సిజేపీకి మంచి భవిష్యత్తు ఉండొచ్చు. కానీ పూర్తిగా స్వతంత్రంగా లేని ఏ ఉద్యమంలోనూ నేను భాగస్వామిని కాలేను” అంటూ తన సపోర్ట్‌ను ఉపసంహరించుకున్నారు.

“ఇది మరో ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ (IAC) మోసం!”
విద్యావేత్తల హెచ్చరిక ప్రముఖ విద్యావేత్త సందీప్ మనుధానే మే 17నే ఎక్స్ (X) వేదికగా ప్రజలను హెచ్చరిస్తూ ఒక పవర్‌ఫుల్ పోస్ట్ పెట్టారు. 2011లో అన్నా హజారే నేతృత్వంలో వచ్చిన ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ (IAC) ఉద్యమాన్ని ఆయన గుర్తుచేశారు.

ఆనాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం వెనుక ఆరెస్సెస్ (RSS) ఐడియాలజీ ఉందని, దాని నుంచే ‘ఆప్’ పుట్టిందని ఆరోపణలు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. “ఒకసారి మోసపోతే తప్పు నీది (IAC).. రెండోసారి కూడా మోసపోతే తప్పు నాది (CJP)” అంటూ నెటిజన్లను అలర్ట్ చేశారు.

విపక్షాల స్పేస్‌ను దెబ్బతీయడానికి ‘ఆప్’ వేసిన సరికొత్త ఎత్తుగడే ఈ కాక్రోచ్ పార్టీ అని ఆయన అభివర్ణించారు.

కేజ్రీవాల్ పిలుపు.. ఆ వెంటనే CJP ఎంట్రీ!
నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ వివాదంపై మే 13న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “విద్యార్థులారా, మీరు రోడ్లపైకి వచ్చి పోరాడాలి. ఈ ప్రభుత్వానికి కేవలం ఉద్యమాల భాషే అర్థమవుతుంది. కేజ్రీవాల్ మీతోనే ఉంటాడు” అని పిలుపునిచ్చారు.

చిత్రంగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే.. సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తెరపైకి రావడం, అది కాస్తా స్టూడెంట్స్ అండ్ యూత్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవడం కేవలం యాదృచ్ఛికమేనా? లేక ముందే ప్లాన్ చేసిన పొలిటికల్ స్క్రిప్టా? అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

మనీష్ సిసోడియా ‘రీల్’.. అభిజీత్ పాత పోస్ట్ లీక్!
ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ.. ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మే 20న ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో అధికారికంగా సిజేపీకి మద్దతు ప్రకటించారు.

“పెద్ద ముసలికి (Crocodile), బొద్దింకలకు (Cockroaches) మధ్య యుద్ధం జరిగితే.. నేను గర్వంగా కాక్రోచ్ జనతా పార్టీ వైపే నిలబడతాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిసోడియా వీడియో వైరల్ అయిన వెంటనే.. నెటిజన్లు అభిజీత్ దీప్కే గతంలో పెట్టిన ఒక పాత పోస్ట్‌ ను, ఫొటోను బయటకు తీశారు.

అభిజీత్ బోస్టన్ వెళ్లే ముందు మనీష్ సిసోడియాను సైడ్ హగ్ చేసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. “ధన్యవాదాలు మనీష్ సిసోడియా సర్. మీతో కలిసి పనిచేసేటప్పుడు మీరు నాకు ఇచ్చిన అవకాశాలకు నేను రుణపడి ఉంటాను. మీ మార్గదర్శకత్వమే నా దిక్సూచిగా నేను బోస్టన్ వెళ్తున్నాను. ఎంత దూరం ఉన్నా ఆప్ (AAP) పట్ల నా నిబద్ధత తగ్గదు” అని అభిజీత్ గతంలో ఎక్స్ (X) లో రాశారు.

అభిజీత్ వివరణ ఏమిటి?
అయితే అభిజీత్ దీప్కే ఓ జాతీయ సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చారు. తన ‘ఆప్’ కనెక్షన్లపై ఓపెన్‌గా మాట్లాడారు. తాను 2020 నుంచి 2023 వరకు ఆప్ సోషల్ మీడియా మరియు ఎలక్షన్ క్యాంపెయిన్ విభాగంలో పనిచేశానని అంగీకరించారు.

ఆప్ విద్యా, వైద్య విధానాలు నచ్చి స్ఫూర్తితో పనిచేశానని, అయితే 2024లో తన పర్సనల్ లైఫ్, ఆర్థిక స్థిరత్వం కోసం బోస్టన్ యూనివర్సిటీలో పీఆర్ చదవడానికి అమెరికా వచ్చానని, ప్రస్తుతం ఆప్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions