Monday 21st September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ కేబినెట్‌లో ‘పొదుపు’ విప్లవం.. మంత్రులు కాన్వాయ్ లో కోత!

ఏపీ కేబినెట్‌లో ‘పొదుపు’ విప్లవం.. మంత్రులు కాన్వాయ్ లో కోత!

ap ministers convoy

AP Ministers Convoy Reduced | ఆంధ్రప్రదేశ్ (AP Government) ప్రభుత్వంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పొదుపు’ మాటే వినిపిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు ఏపీ మంత్రులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూపిన బాటలో ఇతర మంత్రులందరూ తమ భద్రత మరియు కాన్వాయ్‌ల విషయంలో భారీ కోత విధించుకున్నారు.

ఈ ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు మంత్రులు తరలివచ్చారు. అయితే, ఎప్పుడూ భారీ కాన్వాయ్‌లతో కనిపించే మంత్రులు.. నేడు కేవలం ఒక్కో వాహనంలోనే రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గతంలో మంత్రి నారాయణ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు ఉండేవి. నేడు ఆయన తన కాన్వాయ్‌లో ఏకంగా 50 శాతం కోత విధిస్తూ, కేవలం రెండు వాహనాలతోనే సీఎం కార్యాలయానికి చేరుకున్నారు.

మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, పయ్యావుల కేశవ్ వంటి సీనియర్ నేతలు సైతం ఎస్కార్ట్ వాహనాలను పక్కనపెట్టి పొదుపు చర్యల్లో భాగస్వాములయ్యారు.

పాలకులే ఇలా అనవసర ఖర్చులను తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, సామాన్యుల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions