Wednesday 13th May 2026
12:07:03 PM
Home > క్రీడలు > కర్రాళ్లతో క్రికెట్ ఆడిన సంజు శాంసన్.. స్టార్ క్రికెటర్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

కర్రాళ్లతో క్రికెట్ ఆడిన సంజు శాంసన్.. స్టార్ క్రికెటర్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

sanju samson

Sanju Samson’s simplicity | టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ (Sanju Samson) మరోసారి తన నిరాడంబరతతో వార్తల్లో నిలిచారు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే ఈ స్టార్ బ్యాటర్, తాజాగా తమిళనాడులోని ఒక బీచ్‌లో సామాన్య వ్యక్తిలా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తమిళనాడు పర్యటనలో ఉన్న శాంసన్, ఒక బీచ్ వద్ద కొందరు యువకులు సరదాగా క్రికెట్ ఆడుతుండటం గమనించారు. ఎటువంటి హడావిడి లేకుండా నేరుగా వారి దగ్గరకు వెళ్లి వారితో కలిసిపోయారు.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ, లొకల్ కుర్రాళ్లతో కలిసి ఒక సాధారణ కుర్రాడిలా బ్యాటింగ్ చేస్తూ సందడి చేశారు.

శాంసన్ తమతో కలిసి క్రికెట్ ఆడటంతో ఆ యువకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, నిమిషాల్లోనే వైరల్ అయ్యింది.

“నిజమైన స్టార్ అంటే ఇలాగే ఉండాలి” అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

 సాధారణంగా సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాల్లోకి రావడానికి ఇష్టపడరు. కానీ సంజు శాంసన్ మొదటి నుంచీ తన డౌన్-టు-ఎర్త్ ప్రవర్తనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళ కుర్రాడైనప్పటికీ, తమిళనాడులోనూ ఆయనకు ఉన్న క్రేజ్ ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions