Wednesday 17th June 2026
12:07:03 PM
Home > తాజా > ‘TG organics’: ఇక నేరుగా రైతు దగ్గరే కొనొచ్చు!

‘TG organics’: ఇక నేరుగా రైతు దగ్గరే కొనొచ్చు!

tg organics app

– మే 4న యాప్‌ను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల!

TG Organics App | తెలంగాణలో సేంద్రీయ వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త ముందడుగు వేసింది.

సేంద్రీయ ఉత్పత్తుల క్రయవిక్రయాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “TG organics” మొబైల్ యాప్‌ను మే 4వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు.

దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకునేలా మార్కెటింగ్ కల్పించడమే ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం.

సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరులో జరగబోయే కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్ష కూడా నిర్వహించారు.

ఈ యాప్‌లో రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ అథారిటీ గుర్తింపు పొందిన రైతుల వివరాలు మాత్రమే నమోదు చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు.

100కు పైగా ఉత్పత్తులు: ప్రస్తుతం దాదాపు 500 మంది రైతులు పండిస్తున్న 100కు పైగా సేంద్రీయ ఉత్పత్తులు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

50 కిలోమీటర్ల పరిధిలోనే కొనుగోలు..
వినియోగదారులు తమకు సమీపంలోని సుమారు 50 కి.మీ. పరిధిలో ఉన్న రైతుల వివరాలను ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

తద్వారా వినియోగదారులు నేరుగా రైతులతో మాట్లాడి, ధరకు సంబంధించిన సంప్రదింపులు జరుపుకునేలా ఈ యాప్‌లో అవకాశం కల్పించారు.

You may also like
medical shops bundh alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మెడికల్ షాపుల బంద్!
Election commission
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!
Liquor Policy
మద్యం వినియోగంలో తెలంగాణ టాప్..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions