Klaasen Warning | సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన కుటుంబ సభ్యుల ప్రైవసీకి భంగం కలిగించేలా వీడియో తీసిన ఒక వ్యక్తికి క్లాసెన్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ భారీ ఛేజింగ్‌లో క్లాసెన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఈ క్రమంలో క్లాసెన్ తన భార్య, పిల్లలతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక వ్యక్తి తన మొబైల్‌తో వారిని వీడియో తీయడానికి ప్రయత్నించాడు. తన కుటుంబంతో ఉన్నప్పుడు వీడియోలు తీయడం ఇష్టం లేని క్లాసెన్, మొదట సున్నితంగానే వద్దు అని వారించారు.
అయినా సరే ఆ వ్యక్తి వీడియో తీయడం ఆపకుండా, క్లాసెన్ అటు తిరగగానే మళ్లీ రికార్డింగ్ మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన క్లాసెన్ ఆ వ్యక్తి వద్దకు వెళ్లి.. “ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు తీయొద్దు. నేను అటు తిరగగానే వీడియో తీస్తున్నావు, అలా చేయకు. జాగ్రత్తగా విను.. ఇంకొక్కసారి వీడియో తీస్తే మాత్రం మట్టికరుస్తావు” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అండగా నిలుస్తున్న అభిమానులు..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు, క్రికెట్ అభిమానులు క్లాసెన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీలైనా సరే, కుటుంబంతో ఉన్నప్పుడు వారి వ్యక్తిగత స్వేచ్ఛను (Privacy) గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.







