Tuesday 14th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల భక్తులకు అలెర్ట్.. అక్కడ డబ్బులివ్వకండి!  

తిరుమల భక్తులకు అలెర్ట్.. అక్కడ డబ్బులివ్వకండి!  

ttd

Tirumala devotee alert | కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలోని ఉచిత లగేజీ కౌంటర్ల వద్ద ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

తిరుమలలోని ఒక లగేజీ కౌంటర్ వద్ద భక్తుల నుండి ఒక వ్యక్తి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టారు.

అక్రమ వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నరసింహరెడ్డిగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఉద్యోగిని తక్షణమే విధుల నుండి తొలగిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తిరుమల గిరిపై భక్తుల లగేజీ మరియు మొబైల్ ఫోన్ల డిపాజిట్ సేవలను టీటీడీ పూర్తి ఉచితంగా అందిస్తోంది. భక్తులు తమ సామాను భద్రపరిచేందుకు ఎవరికీ ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, పారదర్శకమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని టీటీడీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions