Nara Lokesh TDP National Working President | తెలుగుదేశం పార్టీలో సరికొత్త శకం మొదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతుండగా, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్ నియామకం అయ్యారు.
బుధవారం అమరావతిలో జరిగిన కీలక సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను పార్టీ అధికారికంగా ప్రకటించింది.
కీలక నియామకాలు ఇవే..
నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్: నారా లోకేశ్
జాతీయ ప్రధాన కార్యదర్శులు: కింజారపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్.
ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు: పల్లా శ్రీనివాసరావు (కొనసాగింపు).
కమిటీల కూర్పు ఇలా..
2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ కమిటీలను రూపొందించారు. 29 మంది సభ్యులతో అత్యున్నత నిర్ణాయక మండలి ఏర్పాటు చేశారు.
29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు జరిగింది. నారా లోకేశ్, పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయలను ఎక్స్ ఆఫీషియో మెంబర్లుగా నియమించారు.
అసంతృప్తులకు ఊరట..
నామినేటెడ్ పదవుల భర్తీలో అవకాశం దక్కని సీనియర్ నేతలకు మరియు కష్టపడిన కార్యకర్తలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించారు. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.






