Tuesday 7th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

aiswarya rajesh

Aishwarya Rajesh Comments on Vijay | సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈ కీలక సమయంలో, ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలను ఐశ్వర్య కొనియాడారు.

విజయ్ వ్యక్తిత్వం గురించి ఐశ్వర్య మాట్లాడుతూ.. “విజయ్ సార్ ఎప్పుడూ ఇతరుల గురించి తప్పుగా మాట్లాడరు. బయట ఎంతమంది విమర్శించినా, నెగెటివ్‌గా మాట్లాడినా ఆయన అవేమీ పట్టించుకోరు.

తన పని తాను చేసుకుంటూ నిశ్శబ్దంగా లక్ష్యం వైపు సాగిపోతారు. ఈ అరుదైన లక్షణమే ఆయనను అందరికంటే ప్రత్యేకం చేస్తుంది” అని పేర్కొన్నారు.

“విజయ్ సార్‌కు తన అభిమానులే ప్రపంచం. వారిని ఎలా సంతోషపెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తన వారి కోసం ఆయన నిలబడతారు.

నేటి యువతకు ఆయన ఒక గొప్ప రోల్ మోడల్” అని ఐశ్వర్య ప్రశంసించారు. విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా ప్రజా సేవలోకి వస్తున్న తరుణంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సక్సెస్ జోరులో ఐశ్వర్య: కెరీర్ విషయానికి వస్తే, ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఆమె, ప్రస్తుతం టాలెంటెడ్ నటుడు తిరువీర్‌తో కలిసి ‘ఓ సుకుమారి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

You may also like
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
Iran warship hit by USA
WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions