Monday 23rd March 2026
12:07:03 PM
Home > తాజా > ఇక్కడ కాకపోయినా..అక్కడైనా సీఎం అవుతా..మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇక్కడ కాకపోయినా..అక్కడైనా సీఎం అవుతా..మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Malla Reddy Chitchat with Media | మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Chamakura Mallareddy) ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు పూయాల్సిందే.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన మల్లన్న.. తన మనసులోని ఒక తీరని కోరికను బయటపెట్టారు.

రాజకీయంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలాగూ రాదు కాబట్టి, కనీసం వెండితెరపై అయినా ‘సీఎం’ పాత్ర పోషించాలని ఉందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

“సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర వస్తే చేయడానికి నేను వంద శాతం రెడీ. వెండితెరపై అయినా నా కోరికను తీర్చుకుంటా” అని నవ్వుతూ చెప్పారు. ఇదే క్రమంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై కూడా తనదైన శైలిలో చమత్కరించారు.

“రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి తప్ప మరో పవర్‌ఫుల్ లీడర్ లేరని గతంలోనే చెప్పాను. ఒక రకంగా ఆయన్ను సీఎం చేసింది నేనే” అంటూ నవ్వులు పూయించారు. రాజకీయాలు ఏవైనా.. తాను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని ఆయన స్పష్టం చేశారు.

సినిమాలపై తనకున్న మక్కువను వివరిస్తూ ఒక ఆసక్తికర విషయాన్ని మల్లారెడ్డి వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో తనకు విలన్ పాత్ర ఆఫర్ వచ్చిందని చెప్పారు.

దర్శకుడు హరీశ్ శంకర్ స్వయంగా అడిగినప్పటికీ.. తనకు విలన్ వేషం వేయడం ఇష్టం లేక సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. విలన్ కంటే పవర్‌ఫుల్ గా ఉండే పాజిటివ్ పాత్రలకే తన ఓటు అని హింట్ ఇచ్చారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions