Saturday 4th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > చైనా సరిహద్దున EFL..హైవేపై ల్యాండ్ అయిన ప్రధాని

చైనా సరిహద్దున EFL..హైవేపై ల్యాండ్ అయిన ప్రధాని

PM Modi makes historic touchdown on Assam’s first emergency landing highway | అస్సాం దిబ్రూగఢ్ జిల్లాలోని మోరాన్ బైపాస్‌లో ఈశాన్య భారతదేశంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ విమానం జాతీయ రహదారిపై 4.2 కిలోమీటర్ల పొడవైన స్ట్రెచ్‌పై ల్యాండ్ అయింది. ఇది చైనా సరిహద్దుకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో, యుద్ధ సమయంలో లేదా ప్రకృతి విపత్తుల సమయంలో రాఫెల్, సుఖోయ్-30MKI వంటి ఫైటర్ జెట్‌లు, హెవీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ల్యాండ్, టేకాఫ్ చేయగలిగేలా దీనిని డిజైన్ చేశారు.

ఇది మిలిటరీ, సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ప్రత్యామ్నయంగా పనిచేస్తుంది. చైనా సరిహద్దు ప్రాంతంలో ఇది కీలకమైనది. ప్రధాని మోదీ ఛబువా ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరి ఈ హైవే-రన్‌వే‌పై ల్యాండ్ అయ్యారు. అనంతరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో అద్భుతమైన ఏరియల్ డిస్‌ప్లే నిర్వహించింది. ఇది ఈశాన్య భారత్ లో రక్షణ వ్యూహంలో భారతదేశం బలోపేతానికి సంకేతం. చైనా సరిహద్దులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పరంగా ఇది ముఖ్యమైన అడుగు. ఈ ELF ద్వారా దిబ్రూగఢ్ ఎయిర్‌పోర్ట్ లేదా ఛబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ అందుబాటులో లేని సమయాల్లో ప్రత్యాన్మయ మార్గంగా పనిచేస్తుంది. ఇది రక్షణ, విపత్తు సమయాల్లో ఉపయోగపడుతుంది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions