Vijay Rashmika Wedding Date | టాలీవుడ్ లవ్ బర్డ్స్ గా ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రష్మిక మందన (Rashmika Mandana) పెళ్లి గురించి మరోసారి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది.
గతంలో ఫిబ్రవరి 2న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఘనంగా జరగబోతుందంటూ వీడియోలు, కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వార్తలు పూర్తిగా పుకార్లేనని తాజాగా స్పష్టమైంది.
గత కొంతకాలంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది. గతేడాది అక్టోబర్‌లో వీరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారనే టాక్ వచ్చినా, డేట్ విషయంలో గందరగోళం నెలకొంది.
ఫిబ్రవరి 2న పెళ్లి అంటూ వచ్చిన సమాచారం తప్పని తేలింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రష్మిక, విజయ్ వివాహం ఫిబ్రవరి 26న జరగనుందని ఓ మ్యాగజైన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా పేర్కొంది.










