Sunday 1st March 2026
12:07:03 PM
Home > తాజా > అభిమాని కుమారుడికి పేరు పెట్టిన కేసీఆర్!

అభిమాని కుమారుడికి పేరు పెట్టిన కేసీఆర్!

kcr names his fan's son

KCR Names Fan’s Son | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తన అభిమాని కుమారుడికి నామకరణం చేశారు. పరిగి నియోజక వర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామానికి చెందిన దొడ్ల నర్సింహులు తెలంగాణ ఉద్యమ కారుడు.

కాగా, నర్సింహులు దంపతులకు 9 నెలల కిందట మగ బిడ్డ జన్మించాడు. అయితే తమ అభిమాన నేత కేసీఆర్ తో తన కుమారునికి నామకరణం చేయించుకోవాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. బాబు పుట్టిన తొమ్మిది నెలల నుండి ఎదురుచూస్తున్నారు.

కానీ కుదరలేదు. చివరగా 9 నెలల నిరీక్షణకు వైకుంఠ ఏకాదశినాడు తెరపడింది.  మంగళవారం  నందినగర్ నివాసానికి కుటుంబంతో వచ్చిన నర్సింహులు, అనిత దంపతులను అధినేత కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు.

ఆ దంపతుల కోరికను మన్నించి, వేద పండితుడి సలహాతో, బాబు జన్మ నక్షత్రం ప్రకారం సుమన్ అనే పేరు పెట్టారు.  

You may also like
no permission for organizations on my name, says ktr
నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 
kcr revanth
కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్!
kcr revanth
ఇదేక్కడి జాతిపిత లక్షణం.. కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు!
kalvakuntla kavitha
‘నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు’.. సిట్ పిలిస్తే సహకరిస్తా: కవిత

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions