Tuesday 10th March 2026
12:07:03 PM
Home > తాజా > పెళ్లిపీటలు ఎక్కనున్నమెగా హీరో!

పెళ్లిపీటలు ఎక్కనున్నమెగా హీరో!

sai dharam tej

Mega Hero Marriage News | మెగా కాంపౌండ్ లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. చిరంజీవి మేనల్లుడు, నటుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Teja) తన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు.

ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన వివాహానికి సంబంధించి ఈ విషయం వెల్లడించారు. రానున్న నూతన సంవత్సరంలో స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.

రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ కు మంచి స్పందన వచ్చింది

You may also like
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి
chiranjeevi
నా విజయ రహస్యం నువ్వే అని చెబుతా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
vijay and rashmika in vd14
విజయ్ రష్మిక పెళ్లి డేట్ ఇదే.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
varanasi
కాశీలో హెర్డింగ్ లపై వీడిన సస్పెన్స్.. వారణాసి సినిమా రిలీజ్ డేట్ ఇదే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions