Wednesday 17th June 2026
12:07:03 PM
Home > తాజా > రేవంత్ కేబినెట్ లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం!

రేవంత్ కేబినెట్ లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం!

azharuddin as tg minister

Mohammad Azaruddin | తెలంగాణ కేబినెట్ లో మరో మంత్రి చేరారు. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మహమ్మద్ అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు.

ఈ సందర్బంగా నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో జన్మించిన అజారుద్దీన్ నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా భాధ్యతలు చేపట్టి, 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు.

రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ను నియమించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.  

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions