Shreyas Iyer Back As Captain | టీం ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను ఆస్ట్రేలియా-A తో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచుల కోసం భారత్-A జట్టు కెప్టెన్ గా నియమించింది.
ఇటీవల ప్రకటించిన ఆసియా కప్ జట్టులో శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో విమర్శలు వ్యక్తం అయ్యారు. ఇదే సమయంలో భారత్-A జట్టుకు శ్రేయస్ ను సారథిగా ఎంపిక చేయడం విశేషం. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-ఏ తో భారత జట్టుకు శ్రేయస్ సారథ్యం వహిస్తారు.
ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 16-19 మధ్య మరియు రెండవ మ్యాచ్ 23-26 మధ్య జరగనుంది. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ కు ఎంపికైన ధృవ్ జురెల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. సాయి సుదర్శన్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ సిరీస్ కు ఎంపికయ్యారు.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా గాయపడ్డ నితీష్ కుమార్ రెడ్డి సైతం ఆస్ట్రేలియా-A తో జరగబోయే సిరీస్ లో పాల్గొంటారు. అలాగే తమిళనాడు కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ నారాయన్ జగదీశన్ కూడా అవకాశం అందుకున్నాడు. ఇకపోతే టీం ఇండియా సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ రెండవ మ్యాచుకు అందుబాటులో రానున్నారు.











