Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > మంత్రి పదవిపై కోమటిరెడ్డి మరో బాంబ్

మంత్రి పదవిపై కోమటిరెడ్డి మరో బాంబ్

Komatireddy Rajagopal Reddy News | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి సమీకరణాలు కుదరడం లేదు అని అంటున్నారని కానీ ఎందుకు కుదరడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సమీకరణాలు కుదరకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ఫిరా అయ్యారు. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని మరోసారి గుర్తుచేశారు.

తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని తెలియదా అని అడిగారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా మరోసారి మంత్రి పదవి హామీ ఇచ్చారన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు కేటాయించారని అలాగే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు మూడు మంత్రి పదవులు కేటాయిస్తే తప్పేంటి అని పేర్కొన్నారు.

తాను మరియు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరం సమర్ధులమేనని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగినా మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం జరగ వద్దని స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions