Wednesday 12th August 2026
12:07:03 PM
Home > తాజా > ‘ది ప్యారడైజ్’..’జడల్’ గా రాబోతున్న నాని

‘ది ప్యారడైజ్’..’జడల్’ గా రాబోతున్న నాని

‘The Paradise’: Nani’s first look as Jadal in Srikanth Odela’s film out | నాచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘ది ప్యారడైజ్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

తాజగా మూవీకి సంబంధించి నాని ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇందులో నాని డిఫరెంట్ లుక్ లో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఫస్ట్ లుక్ లో పొడవాటి అల్లిన జడలతో కనిపించారు. అలాగే మూవీలో నాని పేరు ‘జడల్’ అని మూవీ టీం పేర్కొంది.

వాడి పేరు జడల్ అని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నాని. ‘జడల్ నరకంలోకి ప్రవేశించి దానిని స్వర్గం గా మారుస్తాడు’ అని దర్శకుడు పేర్కొన్నారు. ‘ఒక అల్లికగా మొదలై, విప్లవంగా ముగుస్తుంది’ అని నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా ది ప్యారడైజ్ విడుదల కానుంది.

తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన “దసరా’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions