Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > ‘రహస్యంగా కేటీఆర్ లోకేశ్ ను ఎందుకు కలిశాడు’

‘రహస్యంగా కేటీఆర్ లోకేశ్ ను ఎందుకు కలిశాడు’

Why Did KTR Meet Lokesh At Midnight: CM Revanth Reddy | ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నాయకులు నారా లోకేశ్ ను అత్యంత రహస్యంగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

కేటీఆర్ లోకేశ్ ను మూడు సార్లు కలిశాడని, ఏపీ మంత్రితో కేటీఆర్ డిన్నర్ మీటింగు ఎందుకు చేశారని సీఎం ప్రశ్నించారు. లోకేశ్ ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కొరకు ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్ళాలా అని బీఆరెస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

వివాదాలను సృష్టించేందుకు బీఆరెస్ ప్రయత్నిస్తోందని, మరోవైపు కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు ముఖ్యమంత్రి చేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions