Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నిమిష ప్రియ కేసు..బ్లడ్ మనీ అంటే ఏంటి !

నిమిష ప్రియ కేసు..బ్లడ్ మనీ అంటే ఏంటి !

Can ‘Blood Money’ Save Kerala Nurse Nimisha Priya? | యెమెన్ దేశంలో భారత్ కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరికంభానికి దగ్గరయ్యింది. మరికొన్ని గంటల్లో ఆమెకు శిక్ష విధించేందుకు ఆ దేశం సిద్ధమయ్యింది.

ఈ నేపథ్యంలో నిమిష ప్రియ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తుంది. అదే ‘బ్లడ్ మనీ’. యెమెన్‌లో షరియా చట్టం ప్రకారం, హత్య కేసులో బాధితుడి కుటుంబం “బ్లడ్ మనీ” అనే పరిహారాన్ని స్వీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తే, మరణశిక్ష నుండి నిందితురాలు తప్పించుకోవచ్చు.

నిమిష ప్రియ తల్లి ప్రేమ కుమారి, సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సహాయంతో, ఈ దిశగా అనేక ప్రయత్నాలు చేసింది. ప్రేమ కుమారి తన ఇంటిని అమ్మి, గత ఏడాది ఏప్రిల్‌లో యెమెన్‌కు వెళ్లి బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపింది.

రూ.8.6 కోట్లను బాధిత కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధమయ్యింది. అయితే, మెహదీ కుటుంబం బ్లడ్ మనీ స్వీకరించడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. మరోవైపు నిమిష విషయంలో భారతదేశం చేయగలిగింది ఏమీ లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానంకు కేంద్రం వెల్లడించింది. బ్లడ్ మనీ ఒక్కటే ఉత్తమ మార్గం అని అభిప్రాయం వ్యక్తం చేసింది.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions