Saturday 6th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించండి’

‘బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించండి’

MLC Kavitha Meets TTD Chairman | బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు.

ఈ సందర్భంగా తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి టీటీడీ చైర్మన్ కి విజ్ఞప్తి చేశారు.

జూన్ 30న హరితామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కవిత విజ్ఞప్తిపై బీఆర్ నాయుడు స్పందిస్తూ హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే హతిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులు, గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలియజేసినట్లు కవిత పేర్కొన్నారు.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions