Monday 15th June 2026
12:07:03 PM
Home > తాజా > రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు జమ!

రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు జమ!

acb telangana

Rythu Bharosa Scheme | తెలంగాణలోని రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట పెట్టుబడి కోసం అందించే రైతు భరోసా పథకం కింద ఆర్థిక సహాయం సోమవారం నుంచే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరి ఖాతాల్లో ఎకరానికి ఒక్క సీజన్‌కు రూ.6 వేల చొప్పున నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన రైతులందరికీ ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది.

ఈ మొత్తాన్ని ఖరీఫ్ (వానాకాలం) , రబీ (యాసంగి) సీజన్లకు గాను ఒక్కో విడతలో రూ.6,000 చొప్పున పంపిణీ చేస్తారు. ధరణి పోర్టల్‌లో నమోదైన భూమి కలిగిన పట్టాదారులు, అటవీ హక్కుల గుర్తింపు (RoFR) పట్టాదారులు కూడా ‘రైతు భరోసా’కు అర్హులు. ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions