Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఇంటర్ పరీక్ష..ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశ్న’

‘ఇంటర్ పరీక్ష..ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశ్న’

Questions about AAP in Class 12 board exam | ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam Admi Party ) పై ప్రశ్న రావడం రాజకీయ దుమారానికి కారణం అయ్యింది. పంజాబ్ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ ( Political Science ) పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీని ఎప్పుడు స్థాపించారు? దాని విధివిధానాలు ఏంటి? అంటూ ప్రశ్నాపత్రంలో అడిగారు.

పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు మార్చి నాలుగున పొలిటికల్ సైన్స్ పరీక్షను నిర్వహించింది. ఇందులో ఆప్ పై ప్రశ్న రావడం పట్ల ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే.

ఆప్ కు అనుకూలంగా 18 ఏళ్ల యువతను మార్చడానికి రాష్ట్రంలోని భగవత్ మాన్ ప్రభుత్వం విద్యాశాఖను దుర్వినియోగం చేస్తుందని బీజేపీ నాయకులు వినీత్ జోషి ఆరోపించారు. 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లను ఆకర్షించడంలో భాగంగానే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని బీజేపీ మండిపడింది.

వస్తున్న ఆరోపణలు నేపథ్యంలో ఆప్ స్పందించింది. పొలిటికల్ సైన్స్ పేపర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తయారుచేయలేదని బదులిచ్చారు రాష్ట్ర ఆప్ అధ్యక్షులు, మంత్రి అమన్ అరోరా. విద్యాశాఖ పేపర్ ను సిద్ధం చేసిందని, పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రంలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే తప్పేంటని మంత్రి పేర్కొన్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions