Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఛావా’ ఎఫెక్ట్..ఆ కోట వద్ద బంగారు నాణేల కోసం తవ్వకాలు !

‘ఛావా’ ఎఫెక్ట్..ఆ కోట వద్ద బంగారు నాణేల కోసం తవ్వకాలు !

Chhava movie effect: Locals rush for gold at Asirgarh Fort | విక్కీ కౌశల్ ( Vicky Kaushal ), రష్మీక ( Rashmika Mandanna ) ప్రధాన పాత్రలో ఛత్రపతి శంబాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘ఛావా’.

ప్రస్తుతం థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న ఈ మూవీ మూలంగా ఓ ప్రాచీన కోట వద్ద ప్రజలు తొవ్వకలు జరుపుతున్నారు. రాత్రిపూట వేళ వేలల్లో జనాలు అక్కడికి చేరుకుని జల్లెడలు, మెటల్ డిటెక్టర్లు పట్టుకుని బంగారు నాణేల కోసం వెతుకుతున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హన్ పూర్ ( Burhanpur ) లోని అసిర్ ఘడ్ కోట ( Asirgarh Fort ) వద్ద ఇది పరిస్థితి. మొఘలులు మరాఠా సామ్రాజ్యం నుండి దోచుకున్న నిధులను, బంగారు నాణేలను ఈ కోటలో దాచారని ఛావా మూవీలో చూపించారు.

ఇటీవలే ఈ కోట ఉన్న ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు. ఆ మట్టిని కోట ఉండే గ్రామంలోని ఓ పొలంలో పోశారు. అందులో స్థానికులు నాణేలు గుర్తించారు. ఇవి మొఘలుల కాలం నాటి బంగారు, వెండి నాణేలు అంటూ ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో స్థానికులు ఇక్కడకు పోటెత్తుతున్నారు. తవ్వకాల మూలంగా విలువైన చారిత్రక సంపదకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వాపోతున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions