Sunday 27th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘ఆర్సీబీలో కాకుండా ఏబీ డివిలియర్స్ వేరే టీంలో ఉంటే’

‘ఆర్సీబీలో కాకుండా ఏబీ డివిలియర్స్ వేరే టీంలో ఉంటే’

Sanjay Manjrekar claimed that AB de Villiers played for the wrong IPL Team | సౌత్ ఆఫ్రికా ( South Africa ) స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ( AB De Villiers ) ఐపీఎల్ లో భాగంగా తనదైన ఆటతీరుతో ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.

విదేశీ ఆటగాడే అయినా ఏబీని ఇండియన్స్ ఫ్యాన్స్ సొంతం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఆర్సీబీ ( RCB ) ఫ్యాన్స్ కు ఏబీతో ఎమోషనల్ బాండ్ ( Emotional Bond )ఉంది. ఈ క్రమంలో టీం ఇండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ ( Sanjay Manjrekar ) షాకింగ్ కామెంట్స్ చేశారు.

కాగా ఐపీఎల్ తొలి నుండి కొన్ని సీజన్ల వరకు ఏబీడీ ఢిల్లీ తరఫున ఆడిన విషయం తెల్సిందే. అనంతరం 2011 నుండి 2021 వరకు అతడు బెంగళూరు తరఫున స్టార్ ప్లేయర్ గా నిలిచాడు. 2021లో రిటైర్మెంట్ ప్రకటించారు.

అయితే ఒక్కసారి కూడా ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయాడు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ తరఫున కాకుండా ఇతర ఫ్రాంచైజీలో ఆడి ఉంటే అతడి గొప్పతనాన్ని చూసేవాళ్ళం అని మంజ్రేకర్ కామెంట్స్ చేశారు.

మిస్టర్ 360 ( Mr.360 )గా పేరున్న ఏబీని ఆర్సీబీ సరిగ్గా ఉపయోగించుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఇంకా ముందురావాల్సి ఉండేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏబీ డివిలియర్స్ సరైన టీంకు ఆడలేదని మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions