Thursday 13th August 2026
12:07:03 PM
Home > తాజా > అజిత్ ని అభినందించిన పవన్ కళ్యాణ్

అజిత్ ని అభినందించిన పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan congratulates Ajith | తమిళ నటుడు అజిత్ కుమార్ ( Ajith Kumar )ని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) అభినందించారు.

దుబాయ్ వేదికగా జరిగిన 24H కారు రేసింగ్ ( Car Racing )లో అజిత్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ రేస్ లో భాగంగా GT4 విభాగంలో ‘స్పిరిట్ ఆఫ్ ది రేస్’ అవార్డును అజిత్ అందుకున్నారు.

అలాగే 991 విభాగంలో ముడవ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..అజిత్ కు మరియు ‘ అజిత్ కుమార్ రేసింగ్ ‘ టీంకు అభినందనలు తెలియజేశారు.

గొప్ప సంకల్పంతో సవాళ్ళను అధిగమించి ప్రపంచ వేదికపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం స్ఫూర్తిదాయకం అని పవన్ కొనియాడారు.

అజిత్ మరియు ఆయన టీం భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలనికోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పోస్ట్ చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions